ఉడికించి తింటే నో ప్రాబ్లం
బర్డ్ ఫ్లూ భయం, అధికారుల వరుస హెచ్చరికలతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో డిమాండ్ లేక తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపో యాయి. ఆదివారం కిలో రూ.210- 230 ఉండగా.. ఇవాళ కిలో రూ.150-170 పలుకు తోంది. ధర తగినా చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు
ముందుకు రావడం లేదు. నాన్వెజ్ ప్రియులు ప్రత్యామ్నా యంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు.. చికెన్, గుడ్డు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని పశువైద్యులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని, అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని, మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని చెబుతున్నారు.