Home Page SliderNational

“క్రికెటర్లతో సమానంగా ప్రైజ్ మనీ వద్దు”: టీమిండియా కోచ్

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో BCCI వారికి రూ.125 కోట్ల భారీ నజరానా బహుకరించిన విషయం తెలిసిందే.  కాగా ఈ ప్రైజ్ మనీని పంచగా టీమిండియా కోచ్‌తోపాటు క్రికెటర్లు అందరికీ తలా రూ.5కోట్లు వచ్చాయి. మిగతా కోచ్‌లకు 2.5కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు క్రికెటర్లతో సమానంగా రూ.5కోట్ల ప్రైజ్ మనీ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.కాగా తనకు మిగతా కోచ్‌లకు ఇచ్చినట్టే రూ.2.5కోట్లు ఇస్తే చాలని BCCIకి చెప్పినట్లు సమాచారం.అయితే BCCI కూడా దీనికి అంగీకరించిందంట. గతంలో U19WC గెలిచినప్పుడు కూడా రాహల్ ఇలాగే చేశారు. అప్పుడు ఆయనకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ రాగా ఆయన రూ.25 లక్షలు మాత్రమే తీసుకున్నారట. దీంతో ఇది విన్న క్రికెట్ అభిమానులు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి జెంటిల్‌మెన్ అని నిరూపించుకున్నారని కామెంట్ చేస్తున్నారు.