హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి నో పర్మిషన్
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు వెలిశాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవకాశం లేకుండా ఇనుప కంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసుల పేరిట ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతే కాదు.. నిమజ్జనానికి అవకాశం లేకుండా ఇనుప కంచెలను నిర్మించారు. గతంలో కూడా హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేనప్పటికీ, సుప్రీం కోర్టు అనుమతితో నాడు శోభా యాత్ర, నిమజ్జనం జరిగాయి. హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ చేస్తున్న హైడ్రాను సైతం మొత్తం వ్యవహారంలో ప్రతివాదిగా చేశారు.