‘సెనెట్ అనుమతి అక్కరలేదు’..ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజాగా రెండవ సారి అధ్యక్షపీఠాన్ని అలంకరించబోతున్న ట్రంప్ కేబినెట్ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సెనెట్ సభ్యుల అనుమతితో పని లేకుండా కేబినెట్ నియామకాలు చేసుకునే స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు నచ్చిన అధికారులను నియమించుకునే అధికారం కావాలని, అందుకోసం అడ్డుగా ఉన్న నిబంధనలు మార్చాలని కోరుతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం కేబినెట్, జ్యుడిషియల్ పోస్టులకు అధ్యక్షుడు నామినేట్ చేసినా, సెనెట్ ఆమోదం పొందడం కూడా అవసరం. డెమోక్రాట్ పార్టీ సభ్యుల ప్రమేయం లేకుండా ట్రంప్ ఈ నిబంధన పెట్టబోతున్నట్లు సమాచారం. దీనితో పరిపాలనలో డెమోక్రాట్ల జోక్యం తగ్గించాలని ట్రంప్ ఆలోచన.

