‘ఇకపై హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌పై నో ట్రోలింగ్’..ఈ ఫోటోస్ చూడండి..
టీమిండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తరచూ ఫిట్‌నెస్‌పై ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటారు. కానీ ఇకపై ఎవ్వరూ ఆయనను ట్రోల్ చేయలేరంటూ ముంబయ్ క్రికెట్ అసోసియేషన్ ఝలక్ ఇచ్చింది. కొత్తగా ఆధునికీకరించిన అసోసియేషన్ జిమ్‌లో కష్టపడుతున్న రోహిత్ ఫొటోలను షేర్ చేసింది. ఈ జిమ్‌లో తొలిసారి కసరత్తులు చేస్తున్న వ్యక్తి రోహిత్ కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దులీప్ ట్రోఫీ నుండి దూరంగా ఉన్న రోహిత్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. సరికొత్త ఫిట్‌నెస్‌తో టీమ్‌ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్నారంటూ టీమ్ పేర్కొంది.