NewsTelangana

ఇకపై కరెంట్ మీటర్ రీడింగు కోసం సిబ్బందితో పనిలేదు

కరెంటు బిల్లు తడిసి మోపెడవుతోందా?  సిబ్బంది సమయానికి మీటర్ రీడింగు తీయకపోవడం వల్ల స్లాబ్ రేటు మారిపోతోందా? ఇకమీదట ఆ చింత లేదు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. విద్యుత్ శాఖ మీ విద్యుత్ బిల్లును మీరే తీసుకోడంటూ పర్మిషన్ ఇచ్చేసింది. విద్యుత్ బిల్లును డిజిటల్ లావాదేవీల రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. సెల్ఫ్ మీటర్ రీడింగ్‌ను ప్రోత్సహిస్తోంది.

సిబ్బంది వచ్చి మీటర్ రీడింగ్ తీసే వరకూ ఎదురుచూస్తే స్లాబ్ రేటు మారిపోతోంది. అందుకే మన సెల్‌ఫోన్ ద్వారా ప్రతీ నెలా ఏ తేదీన రీడింగ్ తీస్తారో, సరిగ్గా అదే తేదీన తీసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఏం చేయాలంటే TSSPDCL ప్రత్యేక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. మన మీటర్ ఎనిమిదంకెల యూనిక్ సర్వీస్ వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం డాష్ బోర్డుపై సెల్ఫ్ మీటర్ రీడింగ్‌పై క్లిక్ చేస్తే స్కాన్ KWH పై  భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ వస్తుంది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకుని, స్వయంగా మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు. మొబైల్ నంబరును నమోదు చేస్తే, మనకు బిల్లు SMS రూపంలో వస్తుంది. దానిని ఫోన్ పే, గూగుల్ పే, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వంటి యాప్‌ల ద్వారా చెల్లించవచ్చు.