Breaking NewscrimeHome Page SliderNational

నీ భార్య ఎవ‌రితో పిల్ల‌ల‌ను క‌న్నా…తండ్రి మాత్రం నువ్వే !

వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కంటే ఆ పిల్ల‌ల‌కు తండ్రి ఎవ‌ర‌నే ఆంశంపై సుప్రీంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న వాద‌న‌ల‌ న‌డుమ ఆస‌క్తిక‌ర తీర్పు వెలువ‌డింది. అక్రమ సంబంధం కారణంగా జన్మించిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి..? ఎవరు బాధ్యత వహించాలి..? అనేదానిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఒక పురుషుడు (భర్త), ఒక స్త్రీ (భార్య) వివాహ బంధంలో ఉన్నప్పుడు.. వారు పరస్పరం కలిసి గడిపే పరిస్థితిలో ఉన్నప్పుడు.. భార్య ఇతర వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని పేర్కొన్నా.. ఆ పిల్లవాడిని భర్త కుమారుడిగానే గుర్తించాలి.అంటే భార్య వేరొక‌రితో పెట్టుకున్న‌ అక్ర‌మ సంబంధం ద్వారా పుట్టిన పిల్ల‌ల‌కు కూడా తాళి క‌ట్టిన వాడే తండ్రిగా ఉండాల‌ని తీర్పునివ్వ‌డం విశేషం.జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపిన విధంగా.. భారతీయ సాక్ష్యాధికార చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం.. వివాహ సమయంలో జన్మించిన పిల్లవాడిని భర్త కుమారుడిగా గుర్తించే అవకాశం ఉంటుంది. పిల్లవాడి తండ్రిత్వాన్ని నిర్ధారించడానికి డి.ఎన్‌.ఏ. పరీక్షను కోర్టులు ప్రతిసారీ ఆదేశించకూడదు అని తీర్పులో స్పష్టం చేశారు. డి.ఎన్‌.ఏ పరీక్ష అనేది వ్యక్తిగత గోప్యతను భంగపరిచే అవకాశం ఉన్నందున.. కోర్టులు అది అవసరమని నిరూపించే పరిస్థితులలో మాత్రమే ఆదేశించాలి.డి.ఎన్‌.ఏ పరీక్ష వ్యక్తిగత గోప్యతను భంగపరిచే అవకాశం ఉందని.. ఇది ఒక వ్యక్తి ప్రతిష్ట, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అక్రమ సంబంధ ఆరోపణలపై డి.ఎన్‌.ఏ పరీక్షలు చేయించడం ద్వారా వ్యక్తుల సామాజిక జీవితానికి హాని కలుగుతుందని కోర్టు పేర్కొంది.ముఖ్యంగా ఈ తీర్పులో ఏం చెప్పారంటే.. భార్య అక్రమంగా వేరొకరితో పిల్లలను కంటే.. ఆ పిల్లలకు చట్టబద్దంగా ఆమె భర్తే తండ్రి అవుతారని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.