ఎవరు కాదన్నా సర్వే ఆగదు..
ఎవరు కాదన్నా కులగణన ఆగదని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కనక దుర్గమ్మ దర్శనానంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకం. కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి. కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారు. మేం కులగణన పూర్తి చేస్తామని తెలిపారు.