ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గేదేలేదు… పట్టాభి శపథం
తప్పుడు కేసులకు బెదిరేది లేదు.. లొంగేది లేదన్నారు టీడీపీ నేత పట్టాభి. చంద్రబాబు నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతున్న గొంతుక తానన్నారు. గన్నవరంలో బలహీనవర్గాలకు చెందిన దొంతు చిన్నా ఇంటిపై దాడి జరిగితే.. ఆయనకు మద్దతుగా నిలిచేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే… తమపైనే పోలీసులు ఉల్టా కేసులు పెట్టారన్నారు పట్టాభి. టీడీపీ నేతలపైనే దాడి చేసి… తమపైనే పోలీసులు కేసులు బనాయించారన్నారు. గన్నవరంలో జరిగిన హింస, పార్టీ కార్యాలయం దాడి ఘటన ప్రపంచమంతా చూసిందన్నారు. ఒక బలహీనవర్గానికి చెందిన నాయకుడికి వెన్నుదన్నుగా నిలవడం నేరమా అని ప్రశ్నించారు పట్టాభి. బీసీలకు ఎవరూ కూడా మద్దతుగా నిలవరాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ బీసీల పార్టీ అన్నారు పట్టాభి. గన్నవరం మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా వారికి మద్దతుగా నిలుస్తామన్నారు. టీడీపీ యువ నాయకులను 307 సెక్షన్ పెట్టి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. మాపై దాడి చేసి… మాపైనే కేసులు పెట్టారంటూ దుయ్యబట్టారు పట్టాభి. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో తనకు రక్షణ కరువయ్యిందన్నారు. నాడు పోలీస్ స్టేషన్లో… ముగ్గురు దిండుగులు క్రూరంగా రాత్రి 2 నుంచి 5 గంటల వరకు కొట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఘునీ అవుతోందన్న పట్టాభి… పోలీస్ స్టేషన్లో కూడా సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సిబ్బందిని బయటకు పంపించి.. జరిగిన హింసను ప్రజలంతా చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు… తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఇప్పటి వరకు తనపై 4 సార్లు దాడి జరిగిందని. ఐనా కేసులకు వెనకడుగు వేయబోనన్నారు. కష్టకాలంలో కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారన్నారు. తామందరూ కూడా చంద్రబాబు, లోకేశ్ సారధ్యంలో పనిచేస్తామన్నారు.

