ఏ కష్టమొచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు స్పందిస్తాం: రాహుల్, ప్రియాంక
హైదరాబాద్: నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు ఢిల్లీలో ఎప్పుడూ మీ బాగోగులు చూసే సైనికులులా పనిచేస్తాం. మీకు ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ చేయండి వెంటనే మీ దగ్గర ఉంటాం. తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. మా కుటుంబానికి, ఇందిరా గాంధీకి అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారు. ఈ విషయాన్ని జీవితాంతం మరచిపోం. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మారుద్దాం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం వివిధ ప్రాంతాలలో రోడ్ షోలలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్‌ను, కేంద్రంలో మోడీని గద్దె దించడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు బైబై కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ప్రజల సర్కారు ఏర్పాటు చేస్తాం.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఓటరు మహాశయులారా మీ యొక్క ఓటును కాంగ్రెస్ హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రార్థిస్తున్నాం.

