నో హెల్మెట్.. నో ఎంట్రీ..
మెదక్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాహుల్ రాజ్ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు. కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనాలు రావాలంటే తప్పనిసరిగా హెల్మెట్, వాహనపత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. లేదంటే వాహనాన్ని బయటే నిలిపి వేసి లోపలికి రావాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పెట్టడమే కాకుండా ఇవాళ ప్రధాన గేటు వద్ద కలెక్టర్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేయించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనాలను లోపలికి అనుమతించలేదు. హెల్మెట్ లేని వాహనదారులు బయటే ఆపి వేసి నడుచుకుంటూ వచ్చారు.

