మాజీలకు నో ఎంట్రీ..
తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రజా ప్రతినిధులకు ఇన్నర్ లాబీలోకి అనుమతిని నిషేధించారు. ఈ ప్రాంగణంలో ఎలాంటి వీడియోలు తీయరాదని హెచ్చరిక బోర్డులు, నో ఎంట్రీ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఎలాంటి వీడియోలు తీయవద్దని మీడియాను కూడా ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్‌సీలకు అనుమతిని నిరాకరిస్తున్నారు. దీనితో మాజీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

