Home Page SliderNational

ఆ రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

కర్ణాటక ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోకి సీబీఐని అనుమంతించేది లేదని నిషేధించింది. రాష్ట్రంలోని కేసుల దర్యాప్తు కోసం సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ముడా స్కాం కేసు ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి పేర్లు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్కాంలో ముఖ్యమంత్రి తనవారికి స్థలాలు కేటాయించారంటూ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ముడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనితో రాష్ట్రప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విచారణ కోసం సీబీఐకి రిఫర్ చేసిన కేసులన్నీ పెండింగులోనే ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వం పంపించిన అనేక కేసులను దర్యాప్తు చేయడానికి నిరాకరించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.