Home Page SliderTelangana

విద్యార్హత అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..

నిరుద్యోగ యువతకు బంపరాఫర్. ప్రముఖ ఫుడ్ డెలీవరీ కంపెనీ జొమాటో జాబ్ మేళా నిర్వహించబోతోంది. జొమాటోలో ఉద్యోగాల కోసం జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఐటీఐ క్యాంపస్ వికారాబాద్ లో ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు ‘జాబ్ మేళా’ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. జొమాటో లో సుమారు 50 డెలివరీ బాయ్ పోస్టులు ఉన్నాయని, 18 ఏండ్లు నిండిన వారంతా అర్హులని తెలిపారు. ఈ ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్ అవసరమని, విద్యా అర్హత అవసరం లేదని ఆయన అన్నారు. వివరాలకు మియా సాబ్ 9676047444 ను ఫోన్ కు కాంటాక్ట్ చేయొచ్చని తెలిపారు.