Home Page SliderNationalNewsPoliticsTrending Today

వక్ఫ్ బిల్లుపై గందరగోళం వద్దు..మీ మంచి కోసమే..

వక్ఫ్ బిల్లుపై విపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. నేడు కేంద్ర ప్రభుత్వం తరపున లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. గతంలో 1954లో తొలిసారిగా వక్ఫ్ చట్టం అప్రజాస్వామికంగా అమలులోకి వచ్చిందని, పేర్కొన్నారు. అందుకే ఈ బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తున్నామని, వాటిపై గందరగోళం వద్దని విపక్షాలకు నచ్చజెప్పారు. ఈ బిల్లు మీ మంచి కోసమేనని పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులు ఉపయోగించాలని పేర్కొన్నారు. ముస్లిం మహిళలు, పిల్లలకు ఈ బిల్లు వల్ల హక్కులు దక్కుతాయన్నారు. గతంలో దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు కూడా వక్ఫ్ ఆస్తులే అంటూ గతంలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వాదించారని, ఇప్పటికైనా బిల్లు తేకుండా ఇలాగే వదిలేస్తే అవన్నీ కబ్జా చేస్తారని మంత్రి మండిపడ్డారు.