Andhra PradeshHome Page Slider

ఏపీ మంత్రులెవరూ రైతులను పంట నష్టం గురించి అడగడంలేదు: పురందేశ్వరి

భీమడోలు: తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో ఆమె పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవని విమర్శించారు.

రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయి. తడిసిన ధాన్యం కొంటామన్న భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి. రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. గోనెసంచులు సకాలంలో రైతులకు అందట్లేదు అని పురందేశ్వరి ఆరోపించారు.