కాంగ్రెస్ తో పొత్తు లేదు.. ఒంటరిగానే పోటీ చేస్తాం..
ఇండియా కూటమికి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా కేజ్రివాల్ స్పందించారు. “దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు” అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Breaking news: SRK పేరును పబ్లిసిటీ కోసం ఉపయోగిస్తే మీకేం ప్రాబ్లం అంటున్న మహిరా ఖాన్

