TDP ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలపై చర్యలొద్దు-హైకోర్టు
TDP ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలపై ఈ నెల 16వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్, రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిలు ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ మొదలుపెట్టింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ వైసీపీ మంత్రి జోగి రమేష్‌పై కూడా తొందరపడి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.