కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది..
కేరళ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది. నాకు మలయాళం అర్థం కాదు. ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకు ఎవరికైనా అర్థం అయితే చెప్పండి’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తాజాగా కేరళ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేరళలో ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీ వెనుక కవిత పాత్ర ఉందని ఆమె ఏకంగా కేరళ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపిందని ఆ రాష్ట్ర విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కేరళ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

