అధికారం కోసమే నితీష్ కుమార్ మోడీ కాళ్లకు మొక్కారు: ప్రశాంత్ కిషోర్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోడీ కాళ్లకు మొక్కారు. ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారన్నారు. నేను గతంలో నితీష్‌తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరు. అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు. ఇప్పుడు ఎన్‌డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉన్నారని విమర్శించారు.


 
							 
							