సెంచరీతో లక్కీ ఛాన్స్ కొట్టిన నితిష్ ..
ఏపీ కుర్రాడు నితిష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. 171 బంతుల్లో టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ కొట్టేశాడు. దీనితో పాటు లక్కీ ఛాన్స్ కూడా కొట్టాడు. ఏపీ ప్రభుత్వం నుండి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అతనికి రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏసీఏ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ సొమ్ము సీఎం చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ తయారు చేయాలని, అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై 8 వస్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నితిష్ సాధించారు. ఈ సందర్భంగా రెడ్డి హాఫ్ సెంచురీ అనంతరం పుష్ఫ స్టైల్‌లో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.