అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి నితిన్ ఛీఫ్ గెస్ట్
ట్రాఫిక్ ను చెక్ పెట్టడానికి నగరంలోని మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముస్తాబు అయింది. అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి భూసేకరణను జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు కిషన్ రెడ్డి. కొన్నిచోట్ల అక్రమంగా ప్రార్థనా మందిరాలు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.


 
							 
							