ఈ నెల 5న రాష్ట్రానికి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణకు వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.5,416 కోట్లతో 26 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. అంబర్ పేట్ ఫ్లైఓవర్‌ను కూడా అదే రోజు ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాల రాజధానులు జాతీయ రహదారులతో అనుసంధించేందుకు కేంద్రం కృషి చేస్తోందని వివరించారు.