BusinessHome Page SliderNationalNews Alertviral

నీతా-ముకేష్ అంబానీల పెళ్లిరోజు..స్పెషల్ కేక్ చూశారా?

ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన బిజినెస్ కపుల్ నీతా అంబానీ-ముకేశ్ అంబానీల పెళ్లిరోజు కోసం ప్రత్యేకమైన కేక్ తయారు చేయించారు. ఇటీవలే 40వ పెళ్లిరోజు జరుపుకున్న ఈ జంట ఈ వేడుక కోసం ఆరు అంతస్థుల కేక్‌ను ప్రఖ్యాత కేక్ డిజైనర్ బంటీ మహాజన్ తయారు చేశారు. దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది ట్రెండింగులో నిలిచింది. అంబానీల ఇంట్లో వేడుక అంటే అన్నీ గ్రాండ్‌గా ఉండాల్సిందే. అంతే గ్రాండ్‌గా తమ కుటుంబం నడుపుతున్న జామ్ నగర్‌లోని వంతారా థీమ్‌తో ప్రత్యేకమైన కేక్‌ను కస్టమైజ్ చేయించుకున్నారు. హ్యాపీ యానివర్సిరీ డియర్ నీతా ముకేష్ అని రాసున్న కేక్ టాపర్ ఉంచారు. ఏనుగులు, మొసళ్లు, పులులు, సింహాలు వంటి జంతువుల బొమ్మల్ని బంగారు రంగులో తయారు చేయించి కేక్‌పై ఒక్కో లేయర్‌లో ఉంచారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజంగా పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి ఉపయోగించి విభిన్న కేక్స్ తయారు చేయించారు.