అమరావతికి నిర్మలమ్మ బంపర్ ఆఫర్
ఎన్డీయేలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రబడ్జెట్‌లో పెద్దపీట వేశారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు నిర్మల తెలిపారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం రూ.15వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి మరింత సహాయం, అదనపు నిధులు అందుతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతే కాదు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా సంపూర్ణ సహాయం కేంద్రప్రభుత్వం నుండి అందుతుందని తెలిపారు.