Home Page SliderTelangana

ఇప్పుడే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్న నిర్మలా సీతారామన్ భర్త

మోదీ ప్రభుత్వం వచ్చాకే దేశం అత్యంత సంక్షోభ, క్లిష్ట పరిస్థితుల్లో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. నిరుద్యోగం, ధరల పెరుగుదలలు స్వాతంత్య్రం వచ్చాక అత్యధిక స్థాయికి వచ్చాయని పేర్కొన్నారు ఈ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో ఈయన సంక్షోభంలో మన గణతంత్రం-విశ్లేషణ అనే అంశంపై మెఫీ (ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్ ఇండియా) సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. మన దేశం ఆర్థికంగా చాలా దిగజారిపోయిందని, దేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మోదీ ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయా అంటూ విమర్శించారు. ఒక పక్క భారత్‌లో చైనా చొరబడుతోందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని, నిరుద్యోగం పెచ్చు పెరిగిపోయిందని, ఆత్మహత్యలు, హత్యలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు  కులాలు, మతాల పేరుతో కొట్టుమిట్టాడుతున్నాయని, మతం మత్తులో నిద్రపోతోందని విమర్శించారు. దేశాన్ని మరో పాకిస్తాన్ చేయొద్దన్నారు.