Home Page SliderNational

బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలాసీతారామన్ భేటీ

ఢిల్లీలోని భారత్ మండపంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బడ్జెట్ రూపకల్పన గురించి విధి, విధానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు సమీపిస్తుండడంతో తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో వచ్చే వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెడతారు. జీఎస్టీ మండలితోనూ, ఎంఎస్‌ఎంఈ సంస్థలతోనూ కూడా నేడు భేటీ కానున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు 28 శాతం జీఎస్‌టీని అమలు చేయడంలో సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇతర పన్నులు, ఎరువులు వంటి విషయాలపై చర్చించనున్నారు. దీనికోసం పలు రంగాల ఆర్థికవేత్తలతో సంప్రదింపులు జరుగుతున్నాయి