National

నిర్భయ తరహాలో దారుణ గ్యాంగ్ రేప్

గజియాబాద్ : మనసర్కార్

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ప్రజలు ఎంత గగ్గోలు పెట్టినా మహిళలపై వేధింపులు, హింసలు, అత్యాచారాలు తగ్గడం లేదు. సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. ఈ దారుణం నిర్భయ ఘటన కంటే ఘోరమైనదిగా ఉంది. బస్సు కోసం బస్టాండులో వేచి చూస్తున్న మహిళను ఐదుగురు దుండగులు కారులో  కిడ్నాప్ చేశారు. రెండురోజుల పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడి, ఆపై ఇనపరాడ్డులతో చిత్రహింసలకు గురిచేశారు. తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. బాధితురాలికి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు తెలిసినవారేనని సమాచారం. వారితో ఆస్తి తగాదాలు ఉన్నాయని, కేసు కోర్టులో జరుగుతోందని గాజియాబాద్ ఎస్పీ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు ఆమెను జీటీబీ ఆసుపత్రికి చేర్చారు. ఫిర్యాదు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారని, నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలియజేశారు. ఆమె శరీరభాగాల్లో ఇనుపరాడ్‌ను చొప్పించారని, అది ఇంకా ఆమె శరీరంలోనే ఉందని, ఆమె మృత్యువుతో పోరాడుతోందని, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. గాజియాబాద్‌లోని ఎస్ఎస్‌పీ కి నోటీసులు పంపించారు.