నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో షాక్
ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఆయన తన కంపెనీ వాన్‌పిక్‌లో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి.అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా దానిని కొట్టివేసింది.

