Home Page SliderNational

ఫెమినా మిస్ ఇండియా 2024గా మెరిసిన నిఖితా పోర్వాల్

ముంబయిలోని ఫేమస్ స్టూడియోలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్స్ జరిగాయి. ఈ రేసులో మధ్య ప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రేఖా పాండే ద్వితీయ స్థానంలో నిలవగా, ఆయుషీ దొలకియా తృతీయ స్థానంలో నిలిచారు. టీవీ యాంకర్‌గా 18 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన నిఖితా పోర్వాల్ భారత దేశం తరపున మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటారు. గతంలో కూడా భారత్ నుండి గెలుపొందిన ఐశ్వర్యరాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్‌లు మిస్ వరల్డ్‌గా గెలుపొందిన సంగతి తెలిసిందే.