నిక్ 30వ రోజు పుట్టినరోజు వేడుకలు, దుమ్మరేపిన ప్రియాంక
నిక్ జోనాస్ 30వ పుట్టినరోజును ఇవాళ జరుపుకోనున్నారు. పుట్టిన రోజు వేడుకలను భార్య ప్రియాంక చోప్రాతో కలిసి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను నిక్ పంచుకున్నాడు. ప్రైవేట్ జెట్ అందులో కన్పించింది. విమానంలో భార్య ప్రియాంక చోప్రా ఫోన్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. వీడియోలో “హ్యాపీ బర్త్‌డే” బ్యానర్‌తో అలంకరించబడిన ఇంటీరియర్‌ను చూడవచ్చు. మ్యాచింగ్ సన్ గ్లాసెస్‌తో జత చేసిన నల్లటి టీ-షర్ట్‌లో నిక్ జోనాస్ దీమాగా కనిపిస్తుండగా, ప్రియాంక డెనిమ్ ఎన్‌సెంబుల్‌లో కనిపిస్తుంది. క్యాప్షన్‌లో, “ఇదిగో… #30” అంటూ రాసుకొచ్చాడు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కొన్నేళ్ల డేటింగ్ తర్వాత డిసెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌ను సరోగసి ద్వారా పొందారు. కుమార్తెను ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి ప్రియాంక తన కుమార్తెను కలిగి ఉన్న అనేక చిత్రాలను అందిస్తూవస్తున్నారు.
