Home Page SliderNational

ఫీల్డ్‌కు వచ్చిన కొత్తలో కుటుంబసభ్యుల వెలికి గురైన: నోరా ఫతేహీ

బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ ఆసక్తికరమైన విషయాలను మీడియాతో చెప్పారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ సభ్యుల మద్దతు తనకు ఇవ్వలేదని, నన్ను డిస్కరేజ్ చేశారని వెల్లడించారు. అయితే ఆ విషయంలో వారిని నిందించాలని కూడా నేను అనుకోలేదు అని చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేని ప్రపంచంలోనికి వెళ్లడం సగం చావడమేనని, ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక తెలిసిందని ఆమె పేర్కొన్నారు. స్టార్‌డమ్ వచ్చాక ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నా ఫ్యాన్స్‌ను చూసి నా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారని, ఇప్పుడు వారి ధోరణి మారిందని, తనకు ఎంతో సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.