Home Page SliderInternational

పొట్టి వరల్డ్ కప్ నుండి న్యూజిలాండ్‌ ఇంటికి…

పొట్టి వరల్డ్ కప్ టీ20 నుండి న్యూజిలాండ్ కథ కంచికి చేరింది. భారత్ సూపర్ 8కు చేరుకోగా, న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. దీనితో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో గ్రూప్ సిలో పాయింట్లు కోల్పోయింది. పాయింట్ల పట్టికలో చివరస్థానంలో నిలిచింది. అయితే మరో రెండు నామమాత్రపు మ్యాచ్‌లు ఆడితే చాలు. గ్రూప్ సి నుండి వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్‌లు ఆరేసి పాయింట్లు సాధించి సూపర్ 8కు చేరుకున్నాయి. కివీస్ తో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీల నుండి ఉగాండా, పపువా న్యూగినియా జట్లు కూడా పోటీ నుండి ఎలిమినేట్ అయ్యాయి.