ఎర్రకోట వద్ద పేలుడు రికార్డ్ అయిన కొత్త వీడియో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట క్రాసింగ్ వద్ద సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
పేలుడు సంభవించగానే అక్కడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సాక్షులు తెలిపారు. ఆ వేళ రోడ్డుపై ఉన్న వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెట్టింట చర్చకు దారితీస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పేలుడు కారణాలను గుర్తించేందుకు డెల్హీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నాయి.

