‘కాంతార 2’ చిత్రంపై కొత్త అప్‌డేట్..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘కాంతార’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రం విడుదల వాయిదాలు పడుతోందంటూ రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్‌కు చిత్రబృందం చెక్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రకటించినట్లుగా అక్టోబర్ 2నే ఈ చిత్రం విడుదలవుతుందని పేర్కొంది. చిన్న సినిమాగా రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి, సంచలనం సృష్టించింది. దీనితో ‘కాంతార 2’పై అంచనాలు పెరిగిపోయాయి.

