అప్సర హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర అనే యువతి హత్యకేసులో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. సరూర్ నగర్‌లో గుడిలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణ అనే వ్యక్తి అప్సరను శంషాబాద్ వద్ద దారుణంగా హత్య చేసి, ఆమెను మ్యాన్‌హోల్‌లో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు వారిద్దరి మధ్యగల అక్రమ సంబంధమే కారణమని కూడా తేలింది. అయితే ఆమెకు ముందే పెళ్లయ్యిందని, ఆమె భర్త చెన్నైకి చెందిన వారని, విభేదాల కారణంగా ఆమె హైదరాబాద్‌లో తల్లి వద్ద ఉంటోందని తెలిసింది. ఇప్పుడు ఆమె భర్త కార్తిక్ రాజ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తన కుమారుడి ఆత్మహత్యకు అప్సరే కారణమని అతని తల్లి ఆరోపిస్తోంది. వివాహం జరిగిన కొన్ని రోజులకే లగ్జరీలు కావాలంటూ వేధించేదని, టూర్లు తీసుకువెళ్లమని కోరేదని కార్తిక్ తల్లి ధనలక్ష్ని ఆరోపించారు. గొడవలు పడుతూ తన కుమారుడిపై కేసు పెట్టి జైలులో కూడా పెట్టించారని, ఆ అవమాన భారంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె విచారం వ్యక్తం చేసింది. కాగా మరోవైపు ఇప్పటికే సాయికృష్ణను అరెస్టు చేసిన పోలీసులు అతనిని వారం రోజుల పాటు కస్టడీకి కోర్టుకు అప్పీలు చేశారు.