Breaking NewsHome Page SliderTelangana

వైడ్ బాల్ నిర్దార‌ణ కోసం కొత్త టెక్నాల‌జీ

ప్ర‌తీ సారి ఐపిఎల్ లో ఏదో ఒక ఆచ‌రాణాత్మ‌క‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ‌లు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది.ఇందులో భాగంగా వైడ్ బాల్ ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు కొత్త టెక్నాలజీని అమ‌లు చేయ‌నున్నారు.ఐపీఎల్-2025లో ఆఫ్ స్టంప్ బయట, బ్యాటర్ తలపై నుంచి వెళ్లే వైడ్ బాల్‌ను నిర్ణయించడానికి హాక్-ఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఐపీఎల్ గురువారం ఆమోదించింది. అలాగే ముంబైలో జరిగిన సమావేశంలో 10 మంది కెప్టెన్లకు ఈ సమాచారం ఇచ్చింది. ఐపీఎల్-2025 మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.