Home Page SliderNationalTrending Today

నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఇతర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన ఈ పదవిలో ఆరు నెలలు కొనసాగుతారు. అనంతరం నవంబర్ 23న పదవీవిరమణ చేస్తారు. ఈయన సీజేఐ పదవి పొందిన రెండవ దళిత వ్యక్తిగా పేరు పొందారు. గత ఆరేళ్లలో ఆయన 700 ధర్మాసనాలలో అనేక కేసుల విచారణలో పాల్గొన్నారు.