రేపటి నుంచి బంగారంపై కొత్త రూల్
ఇది బంగారం కొనేవారు ,అమ్మేవారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అదేంటంటే ఇటీవల ఆరు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య-HUID లేకుండా హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలు,కళాఖండాల విక్రయాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రూల్ రేపటి నుంచే దేశంలో అమల్లోనికి రానుంది. దీని ప్రకారం హాల్‌మార్క్ లేకుండా బంగారం గానీ,ఆభరణాలు గానీ కొనడం,అమ్మడం ఇకపై సాధ్యం కాదు. కాగా దీనిని బంగారు వ్యాపారుల,వినియోగదారులు తప్పక పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.