సంక్రాంతి తర్వాత న్యూ రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని, స్మాట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను మొదలు పెడతామని తెలిపారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. ఇందుకోసం రూ. 956 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచన ఉన్నట్లు తెలిపారు. రేషన్ లో ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామని అని అన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు.