BusinessHome Page SliderNational

ఐటీ అధికారులకు నూతన అధికారాలు

ఐటీ అధికారులకు ఇకపై సరికొత్త అధికారాలు ఇవ్వబడుతున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈ అధికారులు ఇకపై వ్యక్తుల ఈ మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ వివరాలను పూర్తిగా చెక్ చేస్తారు. పన్ను ఎగవేతలలో ఆదాయానికి మించిన ఆస్తులు, నగదు, బంగారం వంటి ఖాతాలన్నీ తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం వారికి పరిమిత అధికారాలే ఉన్నాయి. ఎవరిపైన అనుమానం గానీ, విశ్వసనీయ సమాచారం కానీ ఉంటేనే సోదాలు నిర్వహిస్తారు. కానీ కొత్త చట్టం ప్రకారం వ్యక్తుల వర్చువల్ డిజిటల్ సిస్టమ్స్‌లోకి తొంగి చూడవచ్చు.  డిజిటల్ యుగానికి తగినట్లు చట్టాన్ని సవరించారు. ఈ చట్టం ఆమోదం పొందితే 2026 ఏప్రిల్ నుండి కొత్త చట్టం అమలులోకి రావచ్చు. అయితే దీనిపై ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు తలెత్తుతున్నాయి.