జగన్, కేసీఆర్ మధ్య కొత్త పంచాయితీ
ఏపీ, తెలంగాణ మధ్య కొత్త పంచాయితీ మొదలయ్యేలా కన్పిస్తోంది. మొన్నటి వరకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలు, నీళ్లలా కలిసి ఉండగా… తాజాగా విద్యుత్ బకాయిల అంశం ఇద్దరిపై అగ్గికి కారణమయ్యేలా ఉంది. ఏపీకి తెలంగాణ నుంచి రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సిందేనన్నారు. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించుకుండా డ్రామాలు ఆడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఏపీయే తెలంగాణకు 11 వేల కోట్లివ్వాలని.. కేంద్రం తక్షణం ఆ మొత్తం ఇప్పించాలని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ డిమాండ్ చేశారు. వాస్తవానికి ఏపీ 1700 కోట్ల బకాయిలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించందన్నారు పెద్దిరెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


