Home Page SliderNational

సూర్య మాస్ కంబ్యాక్‌తో కొత్త సినిమా..

తమిళ సినిమా నుంచి వచ్చిన హీరోస్ ఎప్పుడో మన తెలుగులో కూడా అక్కడితో సమానంగా మార్కెట్‌ని సొంతం చేసుకున్న కొద్దిమంది హీరోలలో సూర్య ఒకరు. మరి సూర్యకి థియేట్రికల్‌గా రీసెంట్‌గా అనుకున్న రేంజ్ సక్సెస్‌లు లేవు. తాను గెస్ట్ రోల్‌లో చేసిన సినిమాలు తప్ప తాను హీరోగా చేసిన సినిమా “ఈటి” డిజాస్టర్ అయ్యింది. దీనితో తరువాత వచ్చే భారీ చిత్రం “కంగువా” దర్శకుడు శివతో చేశాడు.
అయితే దీనిపై భారీ అంచనాలు మొదటి నుంచి నెలకొన్నాయి కానీ, నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రావడం దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా సినిమాలో సూర్య రోల్ కూడా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మరి దీనితో పాటుగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో చేస్తున్న క్రేజీ గ్యాంగ్ స్టర్ డ్రామా గ్లింప్స్ కూడా ఊహించని లెవెల్లో ఉండేసరికి ఈసారి సూర్య కం బ్యాక్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు మాస్ హిట్స్ పడేలా ఉన్నాయని అనిపిస్తుంది. మరి సూర్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిట్స్ ఈ సినిమాలతో సూర్య అందుకుంటాడో లేదో చూడాలి.