రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త కొలువులు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లను నియమించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా నియమితులైన అధికారులు ఇప్పటికే తమ బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పాలనలోనే యువతకు భారీగా ఉద్యోగాలు లభించాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటివరకు 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. జీపీవోలు, ఇంజినీర్లు, సర్వేయర్ల నియామకాల ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం విస్తరించిందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయని విమర్శించిన ఆయన, ఇందిరమ్మ ప్రభుత్వంగా పిలవబడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.