Home Page SliderNational

కొత్త చట్టాలు.. బాధితులకు వేగవంతమైన న్యాయం

జులై 1 నుండి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వస్తాయి. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. అనేక నేరాలకు సంబంధించిన చట్టాన్ని గతంలో కంటే మరింత కఠినతరం చేశారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం మరియు పిల్లల కిడ్నాప్‌లకు సంబంధించిన నేరాలలో శిక్షను కఠినతరం చేశారు. కొన్ని నేరాల్లో జీవిత ఖైదు విధిస్తే దోషి జైలు నుండి బతికుండంగా బయటకు రాలేరు.