Home Page SliderTelangana

హైకోర్టుకు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు మరో నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు. వీరిలో జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు జడ్జీలు జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు పేర్లు ప్రతిపాదించింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లు సమాచారం.