తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం..మహిళలకు ప్రాధాన్యం
తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ విధానంలో మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఓఆర్‌ఆర్ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రీజినల్ రింగు రోడ్డు పరిధిలో పరిశ్రమలు, ఓఆర్‌ఆర్ అనంతరం పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. దీనికోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు-సమ్మిళిత అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం తగిన సహాయం అందజేస్తుందన్నారు.