‘ఏపీ పంచాయితీలకు కొత్త మార్గదర్శకాలు’-పవన్ కళ్యాణ్
ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు ఇకపై నిరంతరాయంగా పంచాయితీ సేవలు అందుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సిబ్బంది లేమి సమస్యలు అధిగమించడానికి పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయితీల క్లస్టర్ విధానంలో మార్పులు తీసుకువచ్చి, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జనాభా, పంచాయితీ ఆదాయాల ప్రాతిపదికన క్లస్టర్ల విభజన చేయాలని సూచించారు. వీధి దీపాలు, తాగునీరు, రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి పనులకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో దీనిపై కమిటీని ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.

