పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం మిజోరం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశాకు, బిహార్ గవర్నర్ గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కేరళకు, కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను బిహార్ కు బదిలీ చేసింది. మిజోరం గవర్నర్ గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ ను, మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.

