బుమ్రాపై మండిపడుతున్న నెటిజన్లు..
ముంబయి ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. బుధవారం జరిగిన సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో బుమ్రా వ్యవహరించిన తీరే దానికి కారణం. బుమ్రా బౌలింగ్‌లో హైదరాబాద్ బౌలర్ అభినవ్ మనోహర్ సిక్స్ కొట్టారు. తర్వాత బుమ్రా ఫుల్ టాస్ వేయడంతో అది నేరుగా పొట్ట వద్ద తాకింది. దీనితో చాలా బాధపడ్డాడు అభినవ్. కానీ బుమ్రా కనీసం పరామర్శించకుండా తన బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోయాడు. తిరిగి కూడా చూడలేదు. దీనితో బుమ్రా ప్రవర్తనపై కామెంట్లు వెల్లువెత్తాయి. బుమ్రా సరైన ఆటతీరును కనపరచలేదని, అతని బౌలింగ్‌లో ఎవరైనా సిక్స్ కొడితే కఠినంగా వ్యవహరిస్తాడని ట్రోల్ చేస్తున్నారు. మనిషిగా కనీసం తన వల్ల దెబ్బ తగిలిన ఆటగాడిని పరామర్శించక పోతే మానవత్వం లేనట్లే అంటూ మండిపడుతున్నారు.